Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుత్తా జ్వాల- విష్ణు విశాల్ పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

Advertiesment
గుత్తా జ్వాల- విష్ణు విశాల్ పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (14:14 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం కూడా జరిగింది. లేటెస్టుగా పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 22న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 
 
తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో తాము పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపారు. గుత్తా జ్వాల, విష్ణు విశాల్. ఇన్నేళ్లుగా తమపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు వారిద్దరూ కలిసి ప్రకటన చేశారు.
 
గత కొన్ని నెలలుగా కోలీవుడ్ నటుడు ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్‌ లు ప్రేమలో ఉన్నారు. ఇటీవల జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేతికి రింగ్ తొడిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రేమ జంట వివాహం ఎప్పుడు అన్నది హాట్ టాపిక్ అయ్యింది. 
 
అయితే ఈ జంట ఇద్దరికి ఇది రెండో వివాహమే అవుతుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో గుత్తా జ్వాల పెళ్లాడారు. ఆ తరువాత 2011లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి జ్వాల సింగిల్‌గా ఉన్నారు. 
 
మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్‌, 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతడు విశాల్ సంరక్షణలో ఉన్నారు. మరోవైపు కెరీర్ విషయాల్లోకి వెళ్తే, గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 
 
ఇటీవలే జ్వాలా గుత్తా అకాడ‌మీ ఆఫ్ ఎక్స‌లెన్సీని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో ఈ అకాడమీ ఉంది. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యం అని జ్వాల అంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Acharya ఆయుధమైనా, అమ్మాయి అయినా... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది..!