Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకోబోతున్నా : విష్ణు విశాల్

జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకోబోతున్నా : విష్ణు విశాల్
, సోమవారం, 22 మార్చి 2021 (07:21 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిబంధంతో ఒక్కటికానున్నారు. 
 
ఈ నేపథ్యంలో దగ్గుబాటి రానా, విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం అరణ్య. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఆదివారం జరిగింది. దీనికి తన కాబోయే భార్య గుత్తా జ్వాలాతో కలిసి విశాల్ హాజరయ్యాడు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ కీలకపాత్ర పోషించాడు. 
 
ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపైనే విష్ణు విశాల్ తన పెళ్లి ప్రకటన చేశాడు. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని వెల్లడించాడు. తాను తెలుగింటి అల్లుడ్ని కాబోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. 
 
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జ్వాల తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిందని తెలిపాడు. జ్వాల, విష్ణు విశాల్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుంది.
 
"గుత్తాజ్వాలను నేను వివాహం చేసుకోబోతున్నా. త్వరలో పెళ్లితేదీని వెల్లడిస్తాం. తెలుగు ఇంటి అల్లుడిని కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. మేమిద్దరం కలిసి హాజరైన తొలి సినిమా వేడుక ఇదే" అని విష్ణు విశాల్ ప్రకటించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.15 కోట్లతో భారీ ఇంటిని నిర్మించుకున్న మిల్కీబ్యూటీ!