హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ను ఈమె పెళ్లాడనుంది. వీరి వివాహం ఈ నెల 22వ తేదీన జరుగనుంది.
అయితే, ఈ పెళ్లికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో సంబరాలు మొదలు పెట్టేశారు. గుత్తా జ్వాలా స్నేహితులు ఇంటికి వచ్చి ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ షురూ చేశారు.
ఫ్రెండ్స్ అందరితో కలిసి గుత్తా జ్వాల చేసిన సందడి ఓ రేంజ్‌లో ఉండగా, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలావుంటే, గుత్తా జ్వాల, విష్ణు విశాల్ ఇద్దరికి ఇది రెండో వివాహమే.
విష్ణు విశాల్ 2010లో రజనీ నటరాజన్‌ను వివాహం చేసుకోగా, 2018లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇక గుత్తా జ్వాల 2005లో బ్యాడ్మింటన్ క్రీడాకరుడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకోగా, మనస్పర్థల వలన 2011లో ఇరువురు విడిపోయారు.
ఆ తర్వాత గుత్తా జ్వాలా, విష్ణు విశాల్‌లు మనస్సులు కలవడంతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరూ ఇటీవలే మాల్దీవులకు విహారయాత్రకు కూడా వెళ్లివచ్చారు. కాగా, విష్ణు విశాల్ తెలుగులో వచ్చిన "అరణ్య" చిత్రంలో నటించారు