Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే నాగబాబుకు నా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది: 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:28 IST)
మా పరువుని బజారు కీడ్చేసిన అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మెగా బ్రదర్‌ మెడకు చుట్టుకుంటోంది. 'మా' ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తాజాగా మాజీ అయిన అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే నా నుంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అది తర్వాత చెబుతాను" అని వ్యాఖ్యానించారు. 
 
మీడియాతో తనకు ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉందనీ, తాను కుట్రలు చేసేవాడినో, కాదో మీడియా మొత్తానికీ తెలుసునని అన్నారు. ప్రతి సంవత్సరమూ 'మా' డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తామని, ఈ సంవత్సరమూ బాగా చేసామని చెప్పుకొచ్చారు. డైరీ వేసినందుకుగానూ రూ.14.20 లక్షలు వచ్చిందని గొప్పగా చెప్పుకున్న నరేష్, కేవలం రూ.7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేసారనీ, మిగిలిన డబ్బు ఏమైందనీ ప్రశ్నించారు. 
 
తాను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందనీ, ఒకటో తేదీలోగా మిగతా డబ్బు 'మా' ఖాతాలో వేయాలని ఆయన డిమాండ్ చేసారు. మిగతా డబ్బు ఏమైందో చెప్పి, వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చారు. 'మా' అధ్యక్ష ఎన్నికలేమో కానీ... చిత్ర పరిశ్రమని మొత్తం బజారుకు ఈడ్చేసారు... ఇప్పుడేమో మెగా సోదరుడి వంతు వచ్చింది... ముందు ముందు... ఇంకా ఎవరు రాబోతారో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments