Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

నరేష్... మార్చి 31 వరకూ 'మా' కుర్చీలో కూర్చుంటే ఖబడ్దార్? శివాజీరాజా బెదిరిస్తున్నారా?

Advertiesment
MAA New President
, శనివారం, 16 మార్చి 2019 (18:20 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో నరేష్, శివాజీ రాజా ప్యానల్ పైన అత్యధిక ఓట్లతో గెలుపొందారు. కాగా ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 22న జరగనుంది. అయితే శివాజీ రాజా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉండటంతో కొత్త బాడీ అప్పటివరకు 'మా' కుర్చీలో ఎవరు కూర్చోవద్దు లేనిచో కోర్టుకు వెళ్తానని శివాజీ రాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
 
మా నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ... 'మా'లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి 'మా' గుట్టు బయట పడకుండా అందరినీ కలుపుకు పోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని వర్క్ చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈనెల 22న మంచి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. 
webdunia
 
శివాజీ రాజా, నా పదవీకాలం 31 వరకు ఉంది. అప్పటివరకు ఎవరూ 'మా' కుర్చీలో కూర్చోవద్దు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు... మేము చేయాల్సిన పనులు చాలా వున్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఈ కార్యక్రంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్టహాసంగా ''లాస్య'' సీమంతం.. వీడియో చూడండి..