తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు సంబంధించిన డేటాను దొంగలించడం ద్వారా ఐటీ ప్రపంచంలో హైదరాబాదుకు వున్న బ్రాండ్ పరువును తీశారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
ట్విట్టర్ వేదికగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందని.. తెల్లకాగితాలపై వీఆర్వో సంతకాలతో అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు.
అలాగే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి.. ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారని తేలిపోయిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని దెబ్బతీసారంటూ #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.