రాకింగ్ స్టార్ య‌ష్‌ భారీ బ‌డ్జెట్ మూవీకి టాక్సిక్ ఖరారు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (11:56 IST)
hero Yash, Toxic
ఏడాదిన్న‌ర‌గా ఆయ‌న కొత్త సినిమాను ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్ని రోజులు సైలెన్స్‌ను పాటించిన హీరో యష్ త‌న కొత్త సినిమాను ప్ర‌క‌టించారు. ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ పేరుతో తెర‌కెక్కుతుంది. సెన్సేష‌న్ పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ య‌ష్‌, అంత‌ర్జాతీయంగా ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం రూపొందుతుంది. 
 
ఓ అద్భుత‌మైన సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న‌తో, ఓర్పుతో, విజ‌న్‌తో వీరిద్ద‌రూ స‌మ‌యాన్ని తీసుకుని ఓ గొప్ప టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమాపై ప‌లు ఉహాగానాలు వినిపించాయి. ఈ క్ర‌మంలో వారు మూవీ టైటిల్‌ను ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ అని ప్ర‌క‌టిస్తూ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. అందులోని విజువ‌ల్స్‌, మూవీ స్కేల్, ప‌ర్‌ఫెక్ష‌న్ క‌నిపిస్తున్నాయి.  
 
వీడియోను గ‌మ‌నిస్తే అందులో మూవీ టైటిల్ ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ అనే టైటిల్‌తో పాటు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించటం అంద‌రినీ మ‌రింత ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ ‘‘రాకింగ్ స్టార్ య‌ష్‌తో సినిమా చేయ‌బోతుండ‌టం ఎంతో ఆనందాన్నిచ్చే విష‌యం. ఇది మాకెంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం. య‌ష్‌, గీతు స్ట్రాంగ్ నెరేష‌న్‌తో మాస్‌, యాక్ష‌న్ అంశాల‌ను క‌ల‌గ‌లిపిన క‌థ‌ను త‌యారు చేయ‌టానికి స‌మ‌యం తీసుకున్నారు. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. 
 
డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. లైయర్స్, మూతోన్ వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. నా దేశంలో నా ఆడియెన్స్ ఇలాంటి డిఫ‌రెంట్ నెరేష‌న్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌టానికి ఎప్పుడూ త‌హ‌త‌హ‌లాడుతుంటాను. అలాంటి ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల క‌ల‌యిక‌గా క‌థ ఉంటుంది. ఈ క్ర‌మంలో నేను య‌ష్‌ను క‌నుగొన్నాను. త‌నొక అద్భుత‌మైన వ్య‌క్తి. నేను అలాంటి వ్య‌క్తిని చూడ‌లేదు. అత‌నితో క‌లిసి ఈ మ్యాజిక‌ల్ జ‌ర్నీని చేయ‌టానికి ఎంతో ఆతృత‌గా ఉన్నాను’’ అన్నారు. 
 
రాకింగ్ స్టార్ య‌ష్‌.. ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’సినిమాకు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10, 2025న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments