విజయవంతంగా ఏ పని చేయాలన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యం. అది లేనిదే ఏదీ చేయలేరు. ఐతే కొందరిలో తమ విశ్వాసాన్ని నాశనం చేసే 10 అలవాట్లు వుంటాయి. అవేమిటో తెలుసుకుందాము. ప్రతి విషయంలోనూ మరొకరితో పోల్చుకోవడం పెద్ద అడ్డంకి. చేయాల్సిన పనిని వాయిదా వేయడం అనేది విశ్వాసాన్ని పాడు చేస్తుంది.
ఏది చేయాలన్నా ఇది చేయవచ్చా లేదా అనే స్వీయ సందేహం. చేయాల్సినది చేస్తే ఏమవుతుందోనని ప్రతికూల స్వీయ-చర్చ. మితిమీరిన ఆందోళనతో పనిని వదిలివేయడం. దృష్టి, ఉత్పాదకత లేకపోవడంతో విశ్వాసం సన్నగిల్లుతుంది.
విపరీతమైన సోషల్ మీడియా వ్యసనం. అనారోగ్యకర సంబంధాలు కలిగి వుండటం. ఒత్తిడి మరియు ఆందోళనతో సతమతం.