అతి పెద్ద ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సి.ఇ.ఓ. టెడ్ సరండోస్ హైదరాబాద్‌లో దిగారు, భారతదేశానికి స్వాగతం పలికిన మొదటి స్టార్ మరెవరో కాదు మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్. ఆర్. ఆర్. ఆర్. సినిమా తర్వాత గ్లోబల్ కథానాయకుడిగా ఎదిగిన రామ్ చరణ్ తో హాలీవుడ్ మూవీ తీసేందుకు జేమ్స్ కేమరెన్ వంటి వారు కూడా ఉత్సహాం చూపారు. అప్పట్లో నెట్ ప్లిక్స్ సంస్థ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.
Ted Sarandos, Chiranjeevi, Ram Charan, saitej, vaishnav tej
కాగా, నిన్న సాయంత్రం చిరంజీవి ఇంటిలో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవి మేనల్లులు సాయితేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు ప్రముఖ నిర్మాత ఆర్కా మీడియా అధినేత కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ తాజా సినిమా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ రాబోతుంది. దీని హక్కులు నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ముందు ముందు కూడా ఆయన సినిమాలు నెట్ ఫ్లిక్స్ చెందేలా ఒప్పందం జరిగి వుంటుందని తెలుస్తోంది.
Ted Sarandos, Chiranjeevi, Ram Charan
కాగా, ఈ సమావేశ వివరాలు బయటకు తెలియకపోయినా ఓ హాలీవుడ్ సినిమాను రామ్ చరణ్ చేయనున్నాడనీ, అందులో చిరంజీవి కూడా పాలుపంచుకోనున్నాడని వార్త వినిపిస్తోంది. రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు దక్కిన సందర్భంగా తనకు కొంచెం ఈర్షగా వుందనీ, తండ్రిగా గర్వంగా వుందని తన మనసులోని మాట చిరంజీవి తెలియజేశారు. సో. ఇప్పుడు తండ్రి కోరికను రామ్ చరణ్ నెరవేరుస్తాడు అన్నట్లుగా ఈ భేటీ వుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.