Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హను-మాన్ కోసం ప్రశాంత్ వర్మ అండర్ వాటర్ సీక్వెన్స్ చిత్రీకరణ

Advertiesment
tej under water
, మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:11 IST)
tej under water
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం' హను-మాన్‌' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. పాన్ ఇండియా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
 
webdunia
prasanth varma direction
ఈ సినిమా టీజర్‌ తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. హనుమంతుని ప్రజన్స్ అందరికి గూస్‌ బంప్‌ లను ఇచ్చింది. ప్రశాంత్ వర్మ విజన్ కు ప్రశంసలు దక్కాయి. తేజ సజ్జ సూపర్ హీరోగా ఆకట్టుకున్నాడు. మరోవైపు, హను-మాన్ టీమ్ ముంబై లో కీలకమైన అండర్ వాటర్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తోంది. యంగ్ విజనరీ  ప్రశాంత్ వర్మ దీనిని గ్రాండ్ కాన్వాస్‌ పై రూపొందిస్తున్నారు. ట్యాలెంటెడ్ తేజ సజ్జ చాలా హార్డ్ వర్క్ చేసి బ్రిలియంట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
 
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, రామ్ చరణ్, శంకర్ సినిమాలు కూడా గతంలో ఇదే టీంతో ఇలాంటి సీక్వెన్స్ ని రూపొందించాయి. పర్ఫెక్షనిస్ట్‌గా పేరుపొందిన ప్రశాంత్ వర్మ ఈ కష్టమైన సీక్వెన్స్ కోసం తేజకు హైదరాబాద్‌లో పదిహేను రోజుల పాటు స్పెషల్ ట్రైనర్ దగ్గర శిక్షణ ఇప్పించారు .
 ఇది చాలా రిస్కీ సీక్వెన్స్. దీని కోసం  తేజ ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండవలసి ఉంటుంది. అయితే తేజ దానిని పట్టుదలతో ప్రాక్టీస్ చేసి చాలా బాగా ఎగ్జిక్యుట్ చేశాడు. అవుట్‌ పుట్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది.
టీజర్ సినిమాపై స్కై-హై అంచనాలను నెలకొల్పింది. అండర్ వాటర్ సీక్వెన్స్ గురించిన ఈ వార్తతో బిగ్ స్క్రీన్‌లపై సినిమాను చూడాలనే క్యూరియాసిటీ మరింతగా పెరిగింది.
 
ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని దసరా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం