రత్న మేఘన క్రియేషన్స్ పతాకంపై శ్రీరాముల నాగరత్నం సమర్పిస్తున్న చిత్రం 'చివరి క్షణం'. ధర్మ దర్శకత్వంలో ఆదిత్య శశాంక్, కవిత మహతో హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతులమీదుగా విడుదలచేశారు. విడుదలైన అనతి కాలంలోనే ఫస్ట్ లుక్‌కు విశేష స్పందిన లభించడం గమనార్హం.
ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సోమవారం హీరో శ్రీకాంత్ మాచిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందుకు ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. అయన విడుదల చేసిన కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఇక ఈ 'చివరిక్షణం' సినిమా విషయానికి వస్తే హైదరాబాద్, మంచిర్యాల లొకేషన్స్‌లో టాకీ పార్ట్ మరియు ఒక సాంగ్‌ను షూట్ చేసాం. మిగిలిన మూడు పాటలను గోవాలో షూట్ చేశాము. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి అతి త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.