పావలా కళ్యాణ్‌ అంటూ హీరోయిన్ విసెష్ .. కంటిమీద కునుకులేకుండా చేసిన పీకే ఫ్యాన్స్

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (10:44 IST)
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు సోమవారం జరిగాయి. ఈ వేడుకలను ఆయన అభిమానులు ఓ పండుగలా జరుపుకున్నారు. పవన్ బర్త్‌డే సందర్భంగా అనేక మంది హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇలా పుట్టిన రోజు శుభాక్షాంక్షలు తెలిపిన హీరోయిన్లలో కొమరం పులి చిత్రంలో నటించిన నికీషా పటేల్ ఒకరు. ఈమె త‌న కోస్టార్‌కి ట్విట్ట‌ర్ ద్వారా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న '#HappyBirthdayPawalaKalyan, #HappyBirthdayPawanaKalyanfromSSMBfans, #HappyBirthdayPawalaKalyan #HappyBirthdayPSPK #pawankalyan' హ్యాష్ ట్యాగ్‌లను జ‌త చేసి మరీ శుభాకాంక్ష‌లు తెలిపింది.
 
ఒక హ్యాష్ ట్యాగ్‌ళో పావ‌లా క‌ళ్యాణ్ అని త‌ప్పుగా రాయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు ఆమెకి కంటిపై కునుకు లేకుండా చేశారు. దీంతో త‌న త‌ప్పుని తెలుసుకున్న నికీషా పాత ట్వీట్స్ డిలీట్‌ చేసి.. త‌ప్పు దిద్దుకున్నాను. ఈసారి సరిగానే ట్యాగ్ చేశా అనుకుంటున్నా. నా ట్వీట్ కారణంగా ఎవ‌రైన హ‌ర్ట్ అయితే క్ష‌మించండి. హ్య‌పీ గ‌ణేషా అని ట్వీట్ చేసింది. దీంతో పీకే ఫ్యాన్ శాంతించారు. 

 

Happy birthday @PawanKalyan #Pawanism #PawankalyanBirthday #Pawankalyan #happybirthdaypowerstar #HappyBirthdayPawanKalyan hope I got the tags right this time! Social media gets too complicated. Dont know how you all keep up with it. pic.twitter.com/2c1e74mJRj

— Nikesha Patel (@NikeshaPatel) September 2, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అలా‌... వైకుంఠ‌పురంలో.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..