ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తుల సంస్థ లెనోవో తన కొత్త రకం స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. జడ్6 ప్రో, కె10 పేరిట రెండు ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.39 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసింది.
ఈ ఫోను వెనుకభాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చింది. దీనికి అదనంగా మరో 8 మెగాపిక్సల్ కెమెరాను కూడా అందిస్తున్నారు. దీంతో 4ఎక్స్ ఆప్టికల్ జూమ్ పొందవచ్చు. అలాగే ఈ రెండు కెమెరాలకు అదనంగా మరో 2 మెగాపిక్సల్ కెమెరాను కూడా ఇచ్చారు. దీంతో 4కె వీడియోలను షూట్ చేసుకోవచ్చు. ఇక ముందు భాగంలో 32 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు.
వీటితోపాటు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో పాటు.. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. దీనికి 27 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. లెనోవో జడ్6 ప్రొ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల చేశారు.
ఈ ఫోన్‌ను రూ.33,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన బెనిఫిట్స్‌ను అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు గాను యూజర్లు రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఫోను ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే,
* 6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 9.0పై, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 48, 16, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
* డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్