ఆ హీరో పక్కన ఇలియానాకు ఛాన్స్... నవ్వాలో ఇంకేం చేయాలో తెలియడంలేదట...

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:40 IST)
గోవా బ్యూటీ, నాజూకు నడుం చిన్నదిగా గుర్తింపు పొందిన ఇలియానా తన ప్రియుడుతో బ్రేకప్ చెప్పింది. దాని గురించి అంతర్జాలంలో పుంఖానుపంకాలుగా వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం ఏవనేది తర్వాత సంగతి. ఇకపోతే ఇల్లీ బ్యూటీ ప్రియుడితో కలిసి వుంటూ సినిమాలు చేయడం మానుకుంది. అకస్మాత్తుగా అవకాశాలు ఇమ్మంటే ఎవరు మాత్రం ఇస్తారు. 
 
పైగా సినిమాల్లో నటించడం మానేశాక నోటికి బాగా పని చెప్పిందో ఏమోగానీ లావయిపోయింది. చెంచా కొవ్వు పెరిగితేనే తట్టుకోలేని సినీ నటీమణులు... అలాంటిది గరిటెల కొద్దీ కొవ్వు చేరితే ఇంకా ఏమన్నా వుందా? అదే ఇప్పుడు ఇలియానాను వేధిస్తోందట. బ్రేకప్ అయిపోతే అయిపోయింది కనీసం సినిమాల్లో నటిద్దామని ఆఫర్లు అడుగుతుంటే దర్శకనిర్మాతలు ఆమెను కింద నుంచి పైదాకా ఎగాదిగా చూస్తున్నారట. 
 
దీనికి కారణం ఆమె విపరీతంగా బరువు పెరగడమే అంటున్నారు. మరి ఈ ఇల్లీ బ్యూటీ తన బరువు తగ్గించుకుని ఎప్పటిలా బక్కబలుచగా మారితే ఎవరైనా ఛాన్సులిస్తారు. మరి తగ్గుతుందా లేదా అని చూడాల్సిందే. అన్నట్లు ఆమెకి చిరంజీవి తదుపరి చిత్రంలో ఛాన్సు దక్కిందనే వార్త వినబడుతోంది. మరీ ముదురుగా కనబడుతున్నందువల్ల ఈ ఛాన్స్ వచ్చిందేమోనని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఐశ్వర్యా రాయ్ నో.. ఇల్లీ బ్యూటీ ఓకే.. చిరంజీవి సరసన సూపర్ ఛాన్స్..?