Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి అన్నయ్యగా ప్రశాంత్.. మరి స్నేహ జోడీగా నటిస్తుందా?

రామ్‌చరణ్, బోయపాటి శీను కాంబినేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బలమైన విలన్‌గా వివేక్ ఒబెరాయ్ కనిపించనుండగా, హీరోయిన్‌గా కైరా ద్వానీ నటిస్తోంది. కీలక పాత్రలో స్నేహ నటించనుంది. ఈ నేపథ్

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (16:27 IST)
రామ్‌చరణ్, బోయపాటి శీను కాంబినేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బలమైన విలన్‌గా వివేక్ ఒబెరాయ్ కనిపించనుండగా, హీరోయిన్‌గా కైరా ద్వానీ నటిస్తోంది. కీలక పాత్రలో స్నేహ నటించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ నటించనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
శంకర్ దర్శకత్వంలోని 'జీన్స్' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రశాంత్, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ చెర్రీ సినిమాలో కనిపించనున్నాడు. ఇందులో ప్రశాంత్ చెర్రీకి అన్నయ్యగా నటిస్తాడని సమాచారం. ఇక స్నేహ ప్రశాంత్ సరసన నటిస్తుందని టాక్. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments