Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్యా... ఎట్టకేలకు హీరో నిఖిల్ పెళ్లి తంతు ముగిసింది...(video)

Webdunia
గురువారం, 14 మే 2020 (08:32 IST)
ఎట్టకేలకు తెలుగు యువ హీరో నిఖిల్ పెళ్లి తంతు ముగిసింది. కరోనా వైరస్ కారణంగా ఈ పెళ్లికి అవాంతరాలు జరుగుతూ వచ్చాయి. దీంతో గత నెలలో జరగాల్సిన పెళ్లి మే నెలకు వాయిదాపడింది. అయితే, లాక్డౌన్ ఇంకా అమల్లో వుండటంతో పెళ్లిని నిరవధికంగా వాయిదావేసుకున్నారు. 
 
కానీ, ఇటీవల లాక్డౌన్ నిబంధనలను కేంద్రం సడలించడంతో పలువురు సెలెబ్రిటీలు ముందుగా కుదుర్చుకున్న వివాహాలను అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిపించుకుంటున్నారు. ఆ కోవలోనే ఇపుడు హీరో నిఖిల్ వివాహం పూర్తయింది.
 
హీరో నిఖిల్.. పల్లవి వర్మ అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు. ఇది పెద్దల అంగీకారంతో జరిగింది. నిఖిల్‌ని పెళ్లి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నాయి. 
 
లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో, అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ పెళ్లి జరిగింది. వాస్తవానికి ఏప్రిల్ 16నే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా వివాహం వాయిదా పడిన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments