Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ పెళ్ళి ముహూర్తం, మే 14 ఉదయం 6:31

Webdunia
బుధవారం, 13 మే 2020 (21:51 IST)
పల్లవి-నిఖిల్
ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ పెళ్ళి, ముహూర్తం రేపు ఉదయం - 06:31 నిమిషాలకు, వేదిక- షామిర్‌పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్. త‌రత‌రాల శ‌క్తినీ, సార్వ‌భౌమాధికారాన్ని, గౌర‌వాన్ని, య‌థాత‌థంగా నిలుపుతామ‌నే ప్ర‌మాణ‌మే వివాహం.. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెళ్ళి ఘడియలు వ‌స్తాయి. ఆ ఘడియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే.
 
స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్‌కి పెళ్లి ఘడియలు రానే వ‌చ్చాయి. డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మతో నిశ్చితార్థమైన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న విష‌యం తెలిసిందే. 
 
అయితే ప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపించి ఎక్క‌డి వారిని అక్క‌డే వుండేలా మ‌నుషుల మ‌ధ్య దూరం వుండేలా చేసింది. ఈ ప‌రిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం.. ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వధూవరులు ఇద్ద‌రి జాత‌కాల రీత్యా రేపు ఉదయం 6:31 నిముషాలకు పెళ్ళి చేయ‌టానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు నిర్ణ‌యించారు.
 
అయితే సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లోజ్ స‌ర్కిల్‌ని మాత్ర‌మే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెళ్ళి చేయ నిశ్చ‌యించారు. ఈ పెళ్ళిలో ప్ర‌భుత్వం సూచించే అన్ని ప‌ద్ధతులు పాటిస్తున్నారు. అభిమానుల మ‌ధ్యలో ఈ పెళ్ళిని ఆడంబరంగా చేసుకొవాల‌నుకున్న నిఖిల్ ఇప్ప‌డు ఈ పరిస్థుతుల్లో కొవిడ్‌-19 వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే వుద్ధేశ్యంతో ఈ పెళ్ళి ఇలా నిరాడంబ‌రంగా చేసుకుంటున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫోటోస్‌, వీడియోస్ మాత్రం ఫ్యాన్స్‌కి సోష‌ల్ మీడియా ద్వారా అందించ‌నున్నారు. ఈ నూత‌న‌ వ‌ధూవ‌రుల‌ను ఎక్క‌డివారు అక్క‌డే వుండి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments