Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ హీరో వివాహం నిరవధికంగా వాయిదా

Advertiesment
టాలీవుడ్ హీరో వివాహం నిరవధికంగా వాయిదా
, ఆదివారం, 3 మే 2020 (15:12 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోలు ఎవరయ్యా అని అడిగితే ఠక్కున చెప్పే పేర్లు రెండు. అందులో ఒకటి ప్రభాస్ కాగా, మరొకటి నితిన్, నిఖిల్. వీరిలో నితిన్, నిఖిల్‌లకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కరోనా లాక్‌డౌన్ లేకుండా ఉన్నట్టయితే గత నెలలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు అయివుండేవారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరి వివాహం వాయిదాపడింది. ఇపుడు లాక్‌డౌన్‌ను మరోమారు పొడగించడంతో నిఖిల్ తన వివాహాన్ని మరోమారు నిరవధికంగా వాయిదావేసుకున్నారు. 
 
హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌కు కొన్నినెలల కిందట భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 3న నిశ్చితార్థం జరుగగా,  అప్పటికే చైనాలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. ఇక, నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతకుముందే లాక్‌డౌన్ రావడంతో ఆ పెళ్లి మే 14వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తంతు!
 
లాక్‌డౌన్ మే 17వ తేదీ వరకు పొడిగించడంతో ఇక తన వల్ల కాదంటూ హీరో నిఖిల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కరనా వైరస్ తొలగిపోయేంత వరకు పెళ్లి లేదని, నిరవధికంగా వాయిదా వేస్తున్నానని తెలిపాడు. 
 
తన వివాహం కారణంగా ఒక్క వ్యక్తికి కరోనా సోకినా అది తనకు మాయని మచ్చ అవుతుందని, అందుకే కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిసోయేపవరకు వేచిచూస్తానని నిఖిల్ వెల్లడించాడు. 
 
తన కాబోయే భార్య పల్లవి కూడా ఇదే అభిప్రాయంతో ఉందని, కరోనా పూర్తిగా నిర్మూలన జరిగిన తర్వాత తన పెళ్లి ఉంటుందని చెప్పుకొచ్చారు. మొత్తంమీద ఈ కరోనా అనేక మంది పెళ్లిళ్ళను అర్థాంతరంగా నిలిపివేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవిగారూ... మిమ్మలను చూస్తే నాకు అలా అనిపించలేదు.. జేడీ చక్రవర్తి