Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాష్ వారియర్‌ పాటపై నిషేధం విధించాలట... జిగ్నేష్ మేవానీ మద్దతు

సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియా ఆకాష్ వారియర్.. మరో వివాదంలో చిక్కుకుంది. ''మాణిక్య మలరాయ పూవీ'' పాటపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ సైగలు ముస్లిం మనోభావాలను కించపరిచేలా

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (16:19 IST)
సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియా ఆకాష్ వారియర్.. మరో వివాదంలో చిక్కుకుంది. ''మాణిక్య మలరాయ పూవీ'' పాటపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ సైగలు ముస్లిం మనోభావాలను కించపరిచేలా వున్నాయంటూ ఇప్పటికే హైదరాబాదులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం ముంబైకి చేరుకుంది. ముంబైలోని రజా అకాడమీ సభ్యులు ఈ పాటను నిషేధించాలంటూ.. సీబీఎఫ్‌సీకి లేఖ రాశారు. 
 
ఈ నేపథ్యంలో ''ఒరు అదార్ లవ్‌''లోని ఓ పాటలో తన కన్నుల హావభావాలతో కన్ను గీటుతూ.. అందంగా హావభావాలు కనబరుస్తూ సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయిన ప్రియా వారియర్‌పై ఓ వైపు కేసులు నమోదైనా.. మరోవైపు ప్రియా వారియర్ వీడియోను గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించేందుకు ఉపయోగించుకున్నారు. 
 
ఈ వీడియో హిట్ కావడం ద్వారా ప్రేమికుల రోజును నిరసించే ఆరెస్సెస్‌కు ఓ సమాధానమని తెలిపారు. ఒకరిని ద్వేషించడం కంటే ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతారని భారతీయులు ఈ వీడియో ద్వారా మరోసారి రుజువు చేశారని ట్విట్టర్‌లో జిగ్నేష్ మేవానీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments