అలుపెరుగని నా తలపుల అలల తీరం నీవు

ఉషోదయ వేళలలో నా హృదయాన్ని తాకిన నా ప్రేమా, పొంగిన హృదయంలో అలల అనురాగం అందుకున్నా నీ ప్రేమ. సుధలూరె అధరాల వర్షం కోసం నా ప్రేమా, అమృత మధనాన్ని నీ పెదవులలో రుచి చూసా నీ ప్రేమ. ప్రకృతి అందాల కలబోత కౌగిలి నా ప్రేమా, రేరాజు నెలరాజు కమ్మదనాన్ని పంచిన కౌగి

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (19:28 IST)
ఉషోదయ వేళలలో నా హృదయాన్ని తాకిన నా ప్రేమా,
పొంగిన హృదయంలో అలల అనురాగం అందుకున్నా నీ ప్రేమ.
 
సుధలూరె అధరాల వర్షం కోసం నా ప్రేమా,
అమృత మధనాన్ని నీ పెదవులలో రుచి చూసా నీ ప్రేమ.
 
ప్రకృతి అందాల కలబోత కౌగిలి నా ప్రేమా,
రేరాజు నెలరాజు కమ్మదనాన్ని పంచిన కౌగిలి నీ ప్రేమ.
 
దిశనెరుగని నా పయనానికి గమ్యం నీవు
అలుపెరుగని నా తలపుల అలల తీరం నీవు
అనుక్షణం నీ ప్రేమానురాగాలకోసం నేను
నా శ్వాస, నా హృదయ స్పందన అంతా నీవే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బెండకాయ ముక్కలు.. రాగులు తీసుకుంటే?