బెండకాయ ముక్కలు.. రాగులు తీసుకుంటే?

ఎముకల బలానికి రోజుకు ఒక కప్పు బెండకాయ ముక్కలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో విటమిన్ బీ6, ఫోలైట్ వంటివి వుండటం ద్వారా ఎముకలకు బలాన్నిస్తాయి. అలాగే రాగులు కూడా ఎముకలకు మేలు చేస్త

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (16:56 IST)
ఎముకల బలానికి రోజుకు ఒక కప్పు బెండకాయ ముక్కలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో విటమిన్ బీ6, ఫోలైట్ వంటివి వుండటం ద్వారా ఎముకలకు బలాన్నిస్తాయి. అలాగే రాగులు కూడా ఎముకలకు మేలు చేస్తాయి. క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రాగుల్లో పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం, ఊబకాయులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం కావడం ద్వారా అధికంగా ఆహారం తీసుకోవడంపై బ్రేక్ వేయవచ్చు. 
 
క్యాల్షియం పుష్కలంగా వుండే రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ఎంతో మేలు చేస్తాయి. గోధుమలు, జొన్నలు, సజ్జలు, మినుములు, రాగులు, కందిపప్పు శరీరానికి పోషకాలను అందిస్తాయి. రోజూ వారీగా తృణ ధాన్యాలు తీసుకోవాలి. 
 
పిల్లలకు తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాలి. వేరు శెనగలు, తేనెను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్, సోయాబిన్, ఫిష్, కోడిగుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చర్మం, కీళ్ళకు మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రేమికుల దినోత్సవం : హైదరాబాద్ నగరంలో బెస్ట్ గేట్‌వేస్ ఏవి?