Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాధను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకొని...

వాలెంటైన్స్ డే అనగానే ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. ప్రేమ అంటే నమ్మకం. ప్రేమికుల మద్య అవగాహన ఉంటే వెన్నెల జాబిలి కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో వారి జీవితంలో అంతే వెలుగు ఉంటుంది. ప్రేమ అంటే వ్యామోహం కాదు.

Advertiesment
రాధను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకొని...
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (21:54 IST)
వాలెంటైన్స్ డే అనగానే ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. ప్రేమ అంటే నమ్మకం. ప్రేమికుల మద్య అవగాహన ఉంటే వెన్నెల జాబిలి కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో వారి జీవితంలో అంతే వెలుగు ఉంటుంది. ప్రేమ అంటే వ్యామోహం కాదు. రెండు స్వచ్చమైన మనసుల కలయిక. రెండు శరీరాల కలయిక కాదు. పాలలో కష్టసుఖాలనే నీళ్ళు ఎన్ని కలిపినా పాలు తెల్లగా ఉంటాయి. అదే పాలలో మోసం అనే నిమ్మరసం కలిపితే పాలు వెంటనే విరిగిపోతాయి. ప్రేమికులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా జీవిస్తారు. కానీ మోసాన్ని భరించలేరు. ఇప్పుడు ప్రేమికుల మద్య నమ్మకం గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం.
 
ఒక పల్లెటూరులో రాధ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అందంలోనూ, ఆటపాటల్లోనూ, చదువులోనూ ఎంతో నేర్పరి. ఆ అమ్మాయి అంటే ఆ ఊరి ప్రజలకు ఎంతో ఇష్టం. ఆ అమ్మాయి అంటే అదే కాలేజిలో చదివే వెంకట్ అనే అబ్బాయికి చాలా ఇష్టం. కాని ఆ విషయం రాధకు చెప్పాలంటే తనను ఎక్కడ కాదంటుందోనన్న భయం.
 
వెంకట్ ఆ విషయాన్ని ముందుగా తన ఇంట్లో చెప్పాడు. వెంకట్ తల్లి ఎందుకు నాన్నా భయపడతావు. నిదానంగా రాధ మనస్థితిని తెలుసుకుని నీ ప్రేమను ఆమెకు తెలియజెప్పు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న వెంకట్ రెండు సంవత్సరాలలో రాధ మనసులో కూడా తానే ఉన్నానని తెలుసుకున్నాడు. ఇరువైపుల కుటుంబాలు వీరిద్దరు ప్రేమను అర్థం చేసుకుని అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేశారు. వెంటనే వెంకట్‌కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. పెద్దలందరూ అమెరికా వెళ్లేందుకు అంగీకరించలేదు. కానీ రాధ మాత్రం వెంకట్‌తో ముందు నువ్వు అమెరికా వెళ్లిరా తరువాతే మనం పెళ్లి చేసుకుందాం అని ధైర్యం చెప్పి పంపించింది. 
 
ఒక సంవత్సర కాలంలో వారి ఇద్దరి మనసులోని ప్రేమను ఫోన్ల ద్వారా తెలియజేసుకున్నారు. ఒకరి మనసునొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంతలో అనుకోని సంఘటన ఎదురైంది. రాధకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్‌లో రాధ తన రెండు కాళ్ళను కోల్పోయింది. రాధను చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. రాధ వారిద్దరికి ధైర్యం చెప్పి మీరు ఈ విషయం వెంకట్‌కి చెప్పవద్దు. మనం ఎవరికి అడ్రస్ చెప్పకుండా వేరే ఊరికి వెళ్ళిపోదాం అన్నది. వెంకట్‌కి రాధ నుండి ఎలాంటి మెసేజ్ రాకపోవడం, ఫోన్ లిప్ట్ చేయకపోవడం బాధని, భయాన్ని కలిగించాయి. వెంటనే ఊరికి తిరిగి వచ్చాడు. రాధ పరిస్థితిని తెలుసుకున్నాడు. 
 
మొత్తానికి తను ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడకు వెళ్లి రాధని కలిసి వెంటనే తన ఊరు వెళ్లిపోయాడు. వెంకట్ ప్రవర్తనకు రాధ ప్రేమంటే ఇంతేన అని చాలా బాధ పడింది. ఒకరోజు ఉదయాన్నే రాధ నిద్ర లేచేసరికి అందమైన పూలతో ఒక బొకె తన మంచం పైన ఉంది. పక్కన చిరునవ్వుతో వెంకట్. రాధ ఈరోజు మనం మన ఇంటికి వెళ్లిపోదాము అని రాధను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటి లోపలికి వెళ్లేసరికి ఇల్లంతా అలంకరణతో, బంధుమిత్రులతో పెళ్లి వేదిక సిద్ధంగా ఉంది. వెంకట్ రాధను ఎత్తుకొని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి తాళి కడుతూ రాధతో... ప్రేమకు అంగవైకల్యం అడ్డుకాకూడదు అని అన్నాడు. రాధ మనస్సు ఆనందంతో నిండిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుచ్చకాయకు శృంగార జీవితానికి లింక్... తింటే ఏమవుతుందో తెలుసా?