Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలేని పెళ్లి జంట జీవితం ప్రేమలేని ఈ పక్షుల కాపురంలా వుంటుంది... చదవండి...

Advertiesment
ప్రేమలేని పెళ్లి జంట జీవితం ప్రేమలేని ఈ పక్షుల కాపురంలా వుంటుంది... చదవండి...
, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (17:11 IST)
ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ఒకరికొకరు నచ్చాలి. ప్రేమ పుట్టాలి. ఆ తరువాతే పెళ్ళీ పిల్లలూనూ. అంటే ఏ జంటయినా అన్యోన్యంగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండటం ఎంతో అవసరం. అది ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చినదయినా వధూవరులు ఇద్దరూ పూర్తిగా ఒకరికొకరు నచ్చితేనే వాళ్లు హాయిగా కలిసి ఉంటారు. అయితే ఇదంతా పరిణామ క్రమంలో భాగమని బ్రిటన్‌కు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. వీళ్లు జీబ్రా ఫించ్ పక్షులలో చేసిన పరిశోధనల ప్రకారం ఆడామగ మధ్య ఉండే ప్రేమ వాళ్ల బంధం మరింత బలపడటానికి పిల్లల్ని ప్రేమించడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. 
 
జీబ్రా ఫించ్ పక్షులు కూడా మనుషుల మాదిరిగానే జంట పక్షులు జీవితాంతం కలిసే ఉంటాయి. అలాగే పిల్లల్ని కూడా చక్కగా సంరక్షిస్తుంటాయి. తమకు నచ్చిన దానినే ఎంపిక చేసుకుంటాయి కూడా. అందుకే వాటిల్లో ఇరవై ఆడ, ఇరవై మగ పక్షులను ఎంపిక చేసి ఒక గదిలో వదిలేశారు. కొన్ని రోజులకు అవన్నీ తమకు నచ్చిన తోడుని ఎంపిక చేసుకున్నాయి. అప్పుడు నిపుణుల బృందం సగం జంటల్ని మాత్రమే వాటి ఇష్టానికి వదిలేసి, మిగిలిన వాటిని బలవంతంగా విడదీసి తమకు నచ్చిన వాటితో ముడివేసి వదిలారట. 
 
ఆ తరువాత ఆ రెండు రకాల జంటల సంసార జీవితాన్ని, అవి పెట్టిన గుడ్లని, అవి చేసిన పిల్లల్ని పరిశీలించగా ప్రేమ పక్షుల జంటల్లో అవి పెట్టిన గుడ్లన్నీ చాలావరకు చక్కగా పిల్లలయ్యాయట. కాని ఇష్టం లేని జంట పక్షుల్లో కొన్ని గుడ్లు పాడైపోవడం, పుట్టాక చనిపోవడం జరిగిందట. మగ పక్షుల పట్ల ఆడ పక్షుల అనాసక్తత, పిల్ల పక్షుల పెంపకంలో మగ పక్షుల నిర్లక్ష్యమూ ఇందుకు కారణమని వాళ్లు గుర్తించారు. దీనిని బట్టి పెళ్లికి ప్రేమ ఎంతో అవసరమనేది ఈనాటిది కాదు, అది జీవపరిణామంలో భాగమేనని లేదంటే ఇంకా మనం ఆదిమానవుడి మాదిరిగానే బహుభర్తృత్వం, బహుభార్యాత్వంలోనే ఉండేవాళ్లమనీ వాళ్లు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవ పొడిలో తేనె కలిపి తీసుకుంటే?