Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

డీవీ
శుక్రవారం, 22 నవంబరు 2024 (18:08 IST)
Harikatha- Divi
సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "హరికథ" అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ "హరికథ" సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి "హరికథ" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు "హరికథ" సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడు తాను మళ్లీ పుడతానని, ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు..పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి..ఇలా శ్రీవిష్ణు అవతారాల రూపంలో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు ?, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ విచారణలో పోలీస్ ఆఫీసర్ కు ఎదురైన ఘటనలు ఏంటి? అనేది ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. నాటకాల్లో దేవుడి పాత్రలు పోషించే నటుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించగా..పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్ నటించారు. మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన "హరికథ" ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments