Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

డీవీ
శుక్రవారం, 22 నవంబరు 2024 (17:53 IST)
Camera man
తెలుగు సినిమా రంగంలో సినిమా తీయడానికి ముందుకు వచ్చే నిర్మాతలు సినిమా పూర్తయ్యేవరకు విడుదల వరకు పూర్తి బాధ్యతతో వుంటారు. కానీ చాలా అరుదైన కేసుల్లో నిర్మాత, దర్శకుడి మధ్య భేదాలు రావడంతో సినిమా దర్శకుడినే మార్చేస్తుంటారు. కానీ సినిమా పూర్తయినప్పటినుంచీ విడుదలవరకు నిర్మాత కనిపించకుండా పోవడమనేది విచిత్రమే. సినిమా ప్రీ రిలీజ్ కూడా హాజరయి హాజరుకానట్లున్న ఓ నిర్మాత ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా  పెట్టి ఓ సినిమా చేశాడు. 
 
అయితే ఆ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. మేనేజర్లు కూడా అందినకాడికి దండుకున్నారనే టాక్ కూడా నెలకొంది. దర్శకుడు మొదట చెప్పినట్లు కాకుండా డబుల్ ది ఎమౌంట్ కావడంతో దాన్ని పూర్తిచేయడానికి సాహసించలేకపోయాడని ఫిలింనగర్ కథనాలు వినిపిస్తున్నాయి. దానితో హీరో తండ్రే పెట్టుబడి పెట్టి సినిమాను బయట పెట్టాడని చిత్ర యూనిట్ ప్రచారం చేస్తోంది.

యూనిట్లో అందరికీ సరిఅయిన పేమెంట్లు కూడా ఇచ్చినట్లు కూడా దాఖలాలు లేవు. ప్రముఖ నటీనటులు మినహా మిగిలినవారికి ఇవ్వకుండా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కోట్లు పెట్టి తీసిన సినిమాకు చివరి నిముషంలో కూడా కష్టానికి ఫలితం రాకపోవడంపట్ల వారంతా ఎవరితో చెప్పుకోలేని స్థితి. కనుక ఈ విషయంలో ఫిలింఛాంబర్ కు చెందిన వివిధ శాఖలు ద్రుష్టిపెట్టాల్సిన అవసరం వుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాియి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments