ప్రిన్సెస్ హన్సిక మోత్వాని టైటిల్ రోల్‌లో స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న చిత్రం `మహా`. యుఆర్ జమీల్ దర్శకత్వంలో మదియళగన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
యాక్షన్, సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన 'మహ' హన్సిక 50వ చిత్రం కావడం విశేషం. స్టార్ హీరో శింబు కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. మహ టీజర్, ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జె లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించగా జాన్ అబ్రహం ఎడిటర్ గా పని చేస్తున్నారు.