Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధ్యప్రదేశ్‌లో ఘోరం - నదిలో బోల్తాపడిన బస్సు

Advertiesment
bus in river
, సోమవారం, 18 జులై 2022 (12:26 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 40 మందితో వెళుతున్న బస్సు ఒకటి ధార్ జిల్లా ఖాల్‌ఘాట్ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది. ఈ బస్సు ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పూణెకు వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. మహారాష్ట్ర రోడ్డ్ సర్వీస్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. 
 
ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు సమాచారం. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీన్స్ ధరించవద్దని చెప్పని భర్తను హతమార్చిన భార్య.. ఎక్కడ?