Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయాల్లో ప్రారంభం అయిన గోపీచంద్, శ్రీను వైట్ల చిత్రం

డీవీ
శనివారం, 27 జనవరి 2024 (18:19 IST)
Gopichand at Himalayas
దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్‌తో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఇటలీలో ఒక షెడ్యూల్‌, మరొక షెడ్యూల్‌ గోవాలో పూర్తి చేశారు. ఈరోజు, గోపీచంద్, ఇతర ప్రముఖ తారాగణంతో హిమాలయాలలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో కీలకమైన, లెంగ్తీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.
 
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ ప్రాజెక్ట్‌తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
తన యాక్టర్స్ కు డిఫరెంట్ మేకోవర్లు ఇవ్వడంలో పేరుపొందిన శ్రీను వైట్ల గోపీచంద్‌ని సరికొత్తగా చూపిస్తున్నారు. ఇందులో యాక్షన్‌తో పాటు శ్రీనువైట్ల మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.
 
శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో  తెలియజేస్తారు మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments