Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీమా టీజర్ లో ఎద్దు పై కూర్చున్న బ్రహ్మ రాక్షసుడుగా గోపీచంద్

Advertiesment
Gopichand, Brahma

డీవీ

, శుక్రవారం, 5 జనవరి 2024 (17:35 IST)
Gopichand, Brahma
గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా' మేకర్స్ టీజర్‌ విడుదల చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ చేశారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగు డెబ్యు చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తునారు.
 
“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ , ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అనే భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది.
 
“ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా 'అని  బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ అవతారంలో పరిచయమయ్యారు గోపీచంద్.  
 
టీజర్ ఓపెనింగ్ ఆధ్యాత్మిక కంటెంట్‌తో మునిలు, దుష్ట శక్తులు కనిపిస్తాయి. ఇది ఎలివేషన్స్‌తో ఆడ్రినలిన్-పంపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. తర్వాత గోపీచంద్ పవర్ ఫుల్ ఎంట్రీ అద్భుతంగా ఆకట్టుకుంది. వీడియో సూచించినట్లుగా, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన లార్జర్ దెన్ లైఫ్ కథగా వుంటుంది.
 
గోపీచంద్ పోలీసు అవతార్‌లో మాచోగా కనిపించారు.  ఖాకీలో పవర్-ప్యాక్డ్ లుక్‌లో గోపీచంద్ ని చూడటం అభిమానులకు, మాస్‌కి పండుగ. టీజర్ లో విజువల్స్ అద్భుతంగా వున్నాయి. హర్ష తన అద్భుతమైన టేకింగ్‌ తో ఆకట్టుకున్నాడు.  
 
స్వామి జె గౌడ కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది, సలార్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన సెన్సేషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదనపు ఎనర్జీని జోడించారు. ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. టీజర్ సినిమాకు హైప్ క్రియేట్ చేసింది.  'భీమా' ఫిబ్రవరి 16, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్  వీడియో ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్.
 
ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.
 తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెప్టెన్ సమాధి వద్ద బోరున విలపించిన కోలీవుడ్ హీరో!!