Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవితేజ, గోపీచంద్ మలినేని చిత్రానికి బ్రేక్ పడిందా!

Advertiesment
RT4gm team
, గురువారం, 7 డిశెంబరు 2023 (18:56 IST)
RT4gm team
కొత్త కొత్త కాంబినేషన్ లు కొత్త కొత్త సినిమాలు షూటింగ్ జరగడం మామూలే. కానీ పాత కాంబినేషన్ లలో రాబోతున్న సినిమాకు బ్రేక్ పడడం కూడా మామూలే. తాజాగా రవితేజ - గోపీచంద్ మలినేని - మైత్రి మూవీ మేకర్స్ సినిమా చేస్తున్నట్లు అక్టోబర్ లో ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించిన ఫొటో షూట్ ను కూడా రవితేజపై చిత్రీకరించారు. కానీ ఏమైందో కానీ ఆ కాంబినేషన్ కు బ్రేక్ పడిందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. 
 
ఇప్పటికే రవితేజ బాగా కష్టపడి చేసినా టైగర్ నాగేశ్వరరావు పెద్దగా క్లిక్ కాలేదు. తాజాగా ఈగిల్ అనే సినిమాతో జనవరికి రాబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీస్ బేనర్ లో సినిమా సెట్ పైకి వెళ్ళాల్సి వుంది. ఈ సినిమాకు రవితేజ్ 45 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు తెలిసింది. 
కానీ దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన బడ్జెట్ భారీ బడ్జెట్ కావడంతో వర్కవుట్ కాదని నిర్మాతలు తప్పుకున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాగా పాన్ ఇండియా లెవల్ లో తీయాలని అనుకున్నారట.
 
రవితేజ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని కి  నాలుగో సినిమా అవుతుంది. 2010లో గోపీచంద్ తొలి దర్శకత్వం వహించిన డాన్ శీనులో రవితేజ నటించారు. వారు 2013లో బలుపు,  2021లో క్రాక్‌లో కలిసి పనిచేశారు. కరోనాటైంలో ఈ సినిమా భారీగా వసూళ్ళు రాబట్టింది. ఇప్పుడు నాలుగవ సినిమాకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. నవీన్ యెర్నేని నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా ఆర్.టి.4 జి.ఎం. వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమ్ ఛేంజర్ లో పాత్ర కోసం బాడీని తగ్గించుకున్న అంజలి, తాజా అప్ డేట్ !