Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజ ఈగల్ సంక్రాంతి కౌంట్ డౌన్ మొదలైంది

Ravi Teja, Eagle
, శుక్రవారం, 24 నవంబరు 2023 (18:42 IST)
Ravi Teja, Eagle
రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ థియేట్రికల్ రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈగల్ నుంచి రవితేజ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
 
50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌లో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. స్టైలిష్‌ డ్రెస్సింగ్ లో చాలా ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ తో క్యూరియాసిటీ పెంచింది. కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు.  
 
సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటించింది. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.
 
కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. దావ్‌జాంద్ సంగీత సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
 
తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొమ్మదేవర రామచంద్ర రావు రూపొందించిన మాధవే మధుసూదన సినిమా రివ్యూ