Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో నాల్గవ సినిమా ప్రారంభం

Ravi Teja, Selvaraghavan, Indhuja - clap by Vinyak
, గురువారం, 26 అక్టోబరు 2023 (15:17 IST)
Ravi Teja, Selvaraghavan, Indhuja - clap by Vinyak
మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని నాల్గవ సారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకా ఫ్లోర్‌లపైకి వెళ్ళకముందే ప్రతి అనౌన్స్ మెంట్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్న #RT4GM భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు.

రవితేజ,సెల్వరాఘవన్, ఇంధూజ రవిచంద్రన్, ఇతర టీమ్ సభ్యులు, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్‌ గా ప్రారంభమైంది. స్క్రిప్ట్‌ని అల్లు అరవింద్ మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌కి కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

నటుడిగా మారిన ఫిల్మ్ మేకర్ సెల్వరాఘవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇది ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా. ఇంధూజ రవిచంద్రన్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియజేస్తారు.

#RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.

సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. రవితేజతో థమన్‌కి ఇది 12వ చిత్రం కాగా, గోపీచంద్ మలినేనితో అతని 7వ చిత్రం, మైత్రీ మూవీ మేకర్స్‌తో 4వ చిత్రం.

బిగిల్, మెర్సల్, తాజా సంచలనం ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రాలకు పని చేసిన అత్యంత ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు #RT4GM కి డీవోపీ గా పని చేస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ కాగ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా, మయూక్ ఆదిత్య, శ్రీనివాస్ గవిరెడ్డి, ఎం వివేక్ ఆనంద్, శ్రీకాంత్ నిమ్మగడ్డ రైటర్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మల ఊరు పేరు భైరవకోన అప్డేట్