Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరాకు కలెక్షన్లు దంచుకోనున్న భగవంత్‌ కేసరి!

bhagawan kesari
, శుక్రవారం, 20 అక్టోబరు 2023 (17:59 IST)
bhagawan kesari
ఈ దసరాకు బాలకృష్ణ, తమిళ విక్రమ్‌, రవితేజ సినిమాల పందెంలో దిగారు. అయితే భగవంత్‌ కేసరి మాత్రమే కలెక్షన్ల పరంగా ఆడియన్స్‌ ఆదరణ పరంగా ముందుంది. మొదట్లో టికెట్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ అయితే బాలకృష్ణ సినిమాకు పెద్దగా బుకింగ్‌ అవ్వలేదు. కానీ విజయ్‌ లియో సినిమాకు మాత్రం ఫుల్‌ బుకింగ్స్‌ అయ్యాయి. తమిళ సినిమాకు తెలుగులో కూడా అవ్వడంతో విశేషంగా చెప్పుకున్నారు.

ఇక, సినిమా విడుదలైన గురువారంనాడు భగవంత్‌ కేసరి సింగిల్‌ హ్యాండ్‌తో బాలకృష్ణ కథను నడిపాడు. ముఖ్యంగా కూతురు సెంటిమెంట్‌, మహిళాసాధికారత అంశం ప్రేక్షకులకు కనెక్ట్‌ అయింది. కొన్ని సినిమాటిక్‌ సన్నివేశాలున్నా సెంటిమెంట్‌బాగా వర్కవుట్‌ అయింది. విజయ్‌ లియో మాత్రం భారీ సినిమాతోపాటు నిడివి ఎక్కువ కావడంతో కథలో పెద్దగా పసలేకపోవడంతోపాటు వయెలెన్స్‌ భారీగా వుండడంతో నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దాంతో కలెక్షన్లు పడిపోయాయి.

ఇక శుక్రవారంనాడు విడుదలైన రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు కూడా డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ అందులో పెద్దగా కామన్‌ మ్యాన్‌కు కనెక్ట్‌ కాకపోవడంతో మైనస్‌గా మారింది. ఇప్పటి తరానికి స్టువర్ట్‌పురం దొంగ కథను తీసుకుని సినిమాగా తీయాలనుకోవడం, ఫైనల్‌గా తను చాలా మంచివాడు అనే కోణంలో సినిమా వుండడంతో రాబిన్‌ హుడ్‌ తరహా కథను చూపించినట్లుంది. ఇందులోనూ భారీగా హింస వుండడంతో నెగెటివ్‌గా మారింది.

మొత్తంగా చూస్తే మూడు సినిమాల్లోనూ కావాల్సినంత వయెలెన్స్‌ వున్నా, కూతురు సెంటిమెంట్‌ కథ భగవంత్‌కే దసరా ప్రేక్షకులు ఓటు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల ఈసినిమాపై పూర్తి సంతృప్తిగా వుండడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాయ చిత్రించిన హనుమంతుని కళను ఆస్వాదించిన సాయితేజ్‌