Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐ డోంట్‌ కేర్‌ అంటున్న భగవంత్‌ కేసరి - రివ్యూ రిపోర్ట్

bhagawan kesari
, గురువారం, 19 అక్టోబరు 2023 (12:57 IST)
bhagawan kesari
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, పి. రవిశంకర్, ఆర్. శరత్‌కుమార్
సాంకేతికత: దర్శకుడు : అనిల్ రావిపూడి, నిర్మాతలు: హరీష్ పెద్ది, సాహు గారపాటి, సంగీతం: ఎస్ థమన్


అక్టోబర్‌ నెల దసరా టైంలో తెలుగునుంచి విడుదలైన సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి.  బాలయ్యకు శ్రీలీల కూతురుగా నటించిన ఈ చిత్రాన్ని ఎఫ్‌2 వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు తీసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి పనిచేయడం తొలిసారి. బాలకృష్ణ స్థాయికి తగినట్లు మాస్‌ యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌ వుందనీ ట్రైలర్‌లోనూ చెప్పేశారు. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ:
అది నేలకొండపల్లి అనే అటవీ ప్రాంతం. అక్కడ ఎస్‌.ఐ.గా చేసిన భగవంత్‌ కేసరి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తాడు. అక్కడ జైలర్‌ శరత్‌కుమార్‌తో ఏర్పడ్డ పరిచయం వారి అమ్మాయి విజయలక్ష్మీ (శ్రీలీల)ను స్వంత కూతురుగా చూసుకుంటాడు. మరోవైపు ప్రపంచంలోనే నెంబర్‌1 అవ్వాలని ఇగోను శ్వాసగా భావించే డ్రెగ్‌ మాఫియావేత్త రాహుల్‌ సాంగ్వీ (అర్జున్‌ రాంపాల్‌)కు భగవత్‌కేసరితో వైరం వుంటుంది. ఆ వైరం కూతురుకాని కూతురు విజయలక్ష్మీని టార్గెట్‌ చేసే వరకు వస్తుంది.  మరి కూతురిని మిలట్రీలోకి పంపి పులిలా పెంచాలనుకున్న భగవంత్‌ కేసరికి ఆ  కల నెరవేరిందా? లేదా? అసలు సాంగ్వీకి భగవంత్‌ కేసరి వైరానికి కారణం ఏమిటి? ఇవి తెలుసుకోవాలనంటే సినిమాచూడాల్సిందే.

సమీక్ష:
ఈకథ దర్శకుడు అనిల్‌రావిపూడికి కొత్త ఫార్మెట్‌. కేవలం బాలకృష్ణను ఉద్దేశించి రాసుకున్న కథ. అందుకే ఆయన సినిమాలో వుండాల్సిన కుటుంబసంబంధాలు, ఫ్యాన్స్‌ను అలరించే యాక్షన్స్‌ మిళితం చేసి తీశారు. ఈమధ్య రజనీకాంత్‌కానీ, కమల్‌హాసన్‌ కానీ ఇటువంటి అంశాలను టచ్‌చేస్తూ పూర్తి ఊరమాస్‌తో కూడిన హింసతో వచ్చారు. సక్సెస్‌ అయ్యాయి. అయితే ఆయా సినిమాల్లో హీరోకు మరో ఇద్దరు హీరోలు తోడుకావడం చిత్రంలో ట్విస్ట్‌లు చూపించారు. కానీ బాలకృష్ణ సినిమా కథ,క థనంలో మరో హీరో అనేవాడు లేకుండానే శ్రీలీలను కూడా మరో హీరో లెవల్లో చూపించి కొత్త దనానికి శ్రీకారం చుట్టారు.

ఈ చిత్ర కథ ఒక్క ముక్కలోచెప్పాలంటే, ఆడపిల్లను షేర్‌ లెక్కన పెంచాలి. దేనికీ భయపడకూడదు. వంటిఇంటికి పరిమితం కాకుండా నలుగురి మెచ్చుకునేలా వుండాలనేది పాయింట్‌. ఈ కథ వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని చెప్పడంతోపాటు తెలంగాణ యాసను తీసుకున్నాడు దర్శకుడు. కాజల్‌ అగర్వాల్‌ పాత్రలో వినోదాన్ని సరికొత్తగా పండించాడు దర్శకుడు. శ్రీలీల పాత్ర కూతురు సెంటిమెంట్‌. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌తోపాటు హింసను కూడా ఎక్కువగానే చూపించాడు. కెజి.ఎఫ్‌.లో వాడిన మెషిన్‌గన్‌లాంటిదాన్ని వాడి అందరూ ఫేమస్‌ అయ్యారని ఓ వ్యక్తి అంటే.. మన ట్రెండ్‌ వేరు అంటూ గ్యాస్‌ సిలెండర్లతో యాక్షన్‌ ఎపిసోడ్‌తో చూపించాడు బాలయ్య.

ఇలా కొన్ని సందర్భాల్లో ఊహకు అందనివిధంగా రాసుకున్న ఈ కథలో బాలకృస్ణ పాత్ర హైలైట్‌. సింగిల్‌ హ్యాండ్‌తోనే నడిపాడు. ఇందులో చాలాకాలం తర్వాత అలనాటి నటి జయచిత్రతో బాలయ్య తల్లిపాత్రగా చూపించాడు దర్శకుడు. భారీతారాగణంతో వున్న ఈసినిమా ఆడపిల్లకు స్కూల్‌ డేస్‌ నుంచే ధైర్యాన్ని నూరిపోసే పెంచాలని బాలయ్యచేత చెప్పించాడు. ఇందులో అందరూ నటీనటులు బాగానే నటించారు. రాజకీయ నేపథ్యం వున్నా ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు టచ్‌ లేకుండా చూపించడం  విశేషం.

మైనస్‌లు..
కథకు అనుగుణంగా నడిచే సన్నివేశాల్లో చాలాసార్లు చూసిన సినిమాలు గుర్తుకువస్తాయి. యాక్షన్‌ సీన్స్‌ చాలా ఎక్కువగా వున్నాయి. నరుక్కోవడం ఎక్కువగా వుంది. ఈమధ్య అన్ని సినిమాల్లో వయొలెన్స్‌ స్థాయి పెరిగింది. కొన్ని సీన్లు సినిమాటిక్‌గా ఇరికించినట్లుగా కనిపిస్తాయి. మహిళ మిలట్రీలోకి ఎక్కువగా వస్తున్న తరుణంలో ఒక్క మహిళను మాత్రమే చూపించి అందరి పురుషుల మధ్య ట్రైనింగ్‌ ఇప్పించడం బాగోలేదు. దంగల్‌ సినిమాలో నాచురల్‌గా చూపించారు.  ఇక చిన్నప్పుడే బాలయ్య తల్లి చనిపోతే, నన్నే మీ అమ్మను అనుకోఅంటుంది విజయలక్ష్మి. భయస్తురాలు, తండ్రి చనిపోయాక భయంఫోబియా ఎక్కువవుతోంది. అలాంటి ఆమెను పులిలా పెంచాలనే తాపత్రయంలో బాలయ్య కష్డపడినసీన్లు చూపించారు. అయితే, శరత్‌కుమార్‌, తన భార్య, పిల్ల గురించి బాలయ్యకు చెబుతూ, మిలట్రీలో నా పిల్లను చేర్పిస్తే విడి;పోయిన నా భార్య హ్యాపీ గా ఉంటుంది అంటాడు. ఆ డైలాగ్‌ను ఎందుకనో శ్రీలీలకు సందర్భం వచ్చినా బాలయ్యచేత చెప్పించలేకపోయాడు.

ఇక టెక్నికల్‌గా, థమన్‌ సౌండ్‌ పొల్యూషన్‌ బాగానే వుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలపరంగా బాగుంది. కెమెరామెన్‌ పనితంబాగుంది. గ్రాఫిక్స్‌ మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సి.ఎం. పాత్రను స్థాయికి తగిన వ్యక్తిచేత చేయించకపోవడం అది కూడా వినోదంగా మార్చేయడం సినిమాలో ప్రత్యేకత. ఇక డైలాగ్స్‌ పరంగా మామూలుగానే వున్నాయి. సి.ఎం. అయినా, పి.ఎం.అయినా ఐ  డోంట్‌ కేర్‌.. అనేది బాలయ్యకు సూట్‌ అయిన డైలాగ్‌. ఆడపిల్లలను చైతన్యం చేసేవిధంగా తీసిన ఈ సినిమాను సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నా, ఎక్కడా ద్వందార్థాలు లేకుండా కుటుంబంతో హాయిగా చూసేలా వుంది.
రేటింగ్‌: 3.25/5


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న పూజా హెగ్డే..