Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గమ్మ వాహనం పులిలా అమ్మాయిని పెంచాలనేదే భగవంత్ కేసరి :నందమూరి బాలకృష్ణ

Balakrishna,thaman,sreleela and others
, సోమవారం, 16 అక్టోబరు 2023 (08:30 IST)
Balakrishna,thaman,sreleela and others
నందమూరి బాలకృష్ణ హీరోగా స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిసున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

బాలకృష్ణ మాట్లాడుతూ.. దుర్గమ్మ వారి నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీ శక్తికి సంబధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఈ సినిమాలో కూడా అమ్మాయిని పులిలా పెంచాలనే మాట వుంది. అలాగే సినిమా పేరు కూడా భగవంతుడితో మొదలైయింది. నేలకొండ భగవంత్ కేసరి హై ఎనర్జీ తో వుంటుంది. అనిల్ రావిపూడి భిన్నమైన సినిమాలు చేశారు. ముందు మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ తో పటాస్ చేశాడు. అందులో కూడా నా పాటని రీమిక్స్ చేశాడు. ఆయన సినిమాలు గమనిస్తే అన్నీ డిఫరెంట్ గా వుంటాయి. చాలా అద్భుతమైన కథతో వచ్చారు. మేమిద్దరం ఈ సినిమా ఒక సవాల్ గా తీసుకున్నాం. చాలా హోం వర్క్ చేశాం. నేను ఏది చేసినా నా అభిమానులని దృష్టిలో పెట్టుకుంటాను. భగవంత్ కేసరి ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులు, అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇంకా గొప్పగా అలరిస్తుంది. నటుల నుంచి, సాంకేతిక నిపుణుల నుంచి తను కోరుకున్నది రాబట్టుకునే దర్శకుడు అనిల్. ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి ఒక వరం. తమన్ అఖండతో బాక్సులు బద్దలగొట్టాడు. చాలా ప్రతిభావంతుడు. అద్భుతమైన పాటలు నేపధ్య సంగీతం అందించాడు. అలాగే రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన డీవోపీ. నా ప్రతి కదలిక తనకి తెలుసు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాం. తన కెమరా ద్వారా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారో ప్రేక్షకులు చూస్తారు. కాజల్ అద్భుతమైన నటి. చాలా మంచి పాత్ర చేశారు. ఒక విస్పోటనం జరిగితే గానీ ఇలాంటి కలయిక జరగదు. విస్పోటనం జరిగితేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి మా భగవంత్ కేసరి. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయి. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారు. అంత అద్భుతంగా వచ్చింది మా మధ్య కెమిస్ట్రీ. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలనే తనప శ్రీలీల లో వుంది. అందుకు అభినందనలు. అర్జున్ రామ్ పాల్ నటన అదరగొట్టారు. తనే డబ్బింగ్ చెప్పారు. ప్రతి పాత్ర అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా వుంది. దాచిపెట్టాం. సినిమా చాలా కూల్ మొదలౌతుంది. తర్వాత దబ్బిడి దిబ్బిడే. ప్రేక్షకులందరినీ సినిమాలో కి తీసుకెళ్ళిపోతుంది. నిర్మాతలు  హరీష్, సాహు చాలా అద్భుతంగా సినిమాని నిర్మించారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ... ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతచక్కగా ఈ ఇందులో పాత్రలని మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తనో మళ్ళీ కలసి పని చేయడానికి ఎదురుచూస్తుంటాను. 19న మా భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం వుంటుంది. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4న 'శంకర్ దాదా ఎంబీబీఎస్' వరల్డ్ వైడ్ రీ-రిలీజ్