Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

4న 'శంకర్ దాదా ఎంబీబీఎస్' వరల్డ్ వైడ్ రీ-రిలీజ్

Advertiesment
shankardada mbbs
, ఆదివారం, 15 అక్టోబరు 2023 (19:31 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "శంకర్ దాదా ఎంబీబీఎస్" చిత్రాన్ని వచ్చే నెల నాలుగో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు. ఇది హిందీలో సంజయ్ దత్ నటించిన "మున్నభాయ్ ఎంబీబీఎస్‌"కు రీమేక్. ఈ చిత్రం చిరంజీవి సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలించింది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం.. ఇపుడు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రానుంది. 
 
నిజానికి ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తారంటూ గత ఆగస్టు నుంచి విస్తృతంగా ప్రచారం సాగుతోంది. తాజాగా రీరిలీజ్‌ ముహుర్తాన్ని ఖరారు చేశారు. వచ్చే నెల 4వ తేదీన "శంకర్ దాదా ఎంబీబీఎస్" సినిమాను రిలీజ్ చేయనున్నట్టు బీఏ రాజు బృందం ప్రకటించింది.
 
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చూపించిన కామెడీ టైమింగ్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. బాస్‌కు ముఖ్య అనుచరుడిగా, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ జీవించారు. దీంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరోమారు థియేటర్లలో  సందడి చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్‌గా చేసే సమయంలో ఇబ్బందులు పడ్డా కానీ హద్దులు దాటలేదు : సుహాసిని