Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ఎవరిని? అంటూ హిమాలయాల్లో ఒంటరిగా నగ్నంగా తిరుగుతున్న హీరో

Advertiesment
vidyut jammwal
, సోమవారం, 11 డిశెంబరు 2023 (19:56 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
నేను ఎవరిని? ఈ ప్రశ్న బాహుబలి చిత్రంలోనిది. కానీ నిజజీవితంలో కూడా బాలీవుడ్ హీరో తను ఎవరిని, ఎవరిని కాదో తెలుసుకునేందుకు హిమాలయాల్లో ఒంటరిగా సంచరిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు విద్యుత్ జమ్వాల్. ఒంటరిగా సంచరించడమే కాదు, శరీరంపై నూలుపోగు లేకుండా నగ్నంగా హిమనీనదాల్లో స్నానాదికాలు చేస్తూ సూర్యనమస్కారాలు చేస్తున్నారు.
 
ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితుడే. తెలుగులో శక్తి చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ నటుడు ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రంలోనూ నటించాడు. ఆ తర్వాత తమిళంలో బిల్లా 2, తుపాకి తదితర చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఆధ్యాత్మికపరంగా తను ప్రతి ఏటా హిమాలయాలకు వెళ్లి తనలో తను తొంగి చూసుకుంటూ వుంటాడట.
 
ముఖ్యంగా అక్కడ ఏకాంతంగా వుంటూ, దుస్తులు ధరించకుండా సంచిరిస్తుంటాడట. ఇలా కనీసం వారం పదిరోజులు తర్వాత తనకు ఎక్కడలేని ప్రశాంతత చేకూరుతుందనీ, తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చానన్న ప్రశ్నలకు సమాధానం కాస్తోకూస్తో దొరుకుతన్నట్లు భావన కలుగుతుందని చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుతం అతడు హిమాలయాల్లో నగ్నంగా సంచరిస్తున్న ఫోటోలను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసాడు. వాటిపై నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు కారం నుంచి బొబ్బలు పెట్టే కాఫీతో ఆనందకరమైన మెలోడీ ఓ మై బేబీ ప్రోమో