లేడీ ఓరియెంటెడ్ సినిమా అని ఎందుకంటారు?: అనసూయ ప్రశ్న

బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సం

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (15:56 IST)
బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లోని లుక్‌ను బట్టి నెటిజన్లు ఇదో లేడి ఓరియెంటెడ్ సినిమా అని కామెంట్లు పెట్టారు. 
 
ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ.. ఏ చిత్రంలోనైనా హీరో ప్రధాన పాత్రలో కనిపిస్తే దాన్ని కథానాయకుడి ప్రాధాన్యం వున్న సినిమా అని ఎవ్వరూ చెప్పరు. అదే ఓ నటి ప్రధాన పాత్రలో కనిపిస్తే మాత్రం ప్రత్యేకించి దాన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటారు. అయినా ఇలా ఎందుకంటారు.. అంటూ అనసూయ ప్రశ్నించింది. 
 
కానీ ఆ ప్రశ్నేసిన తర్వాత కొంత సమయానికే తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. నిజాయితీగా అడిగానని చెప్పింది. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం వుంటుంది. సినిమాకు ప్రతి పాత్ర ముఖ్యమే. తామంతా పాత్రల్ని పోషిస్తున్నాం. సరైన విధంగా మమ్మల్ని పిలవాలనేది తమ అభిప్రాయం. ప్రధాన పాత్రలో ఆయన/ఆమె నటిస్తున్నారు అంటే సరిపోతుంది కదా అంటూ అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ అనసూయ కథనం ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

టూవీలర్ ఓవర్.. ఆటోలో ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

నీ ప్రియుడితో చల్లగా నూరేళ్లు వర్థిల్లు నా శ్రీమతి: ప్రియుడితో పెళ్లి చేసి భర్త సూసైడ్

Rahul Gandhi: ఈమె ఎవరో చెప్పండి.. విలేకరులను ప్రశ్నించిన రాహుల్ గాంధీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments