Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న‌టి నుంచి గుళ్లూగోపురాలు చుట్టూ తిరుగుతున్న‌ వ‌ర్మ..‌. ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (15:31 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటుంటారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిల్ కూడా ఎనౌన్స్ చేసారు. తెలుగుదేశం నాయ‌కులు ఫైర్ అవ్వ‌డంతో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ప‌క్క‌న పెట్టి నాగార్జున‌తో ఆఫీస‌ర్ సినిమా చేసాడు.
 
ఆ త‌ర్వాత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడ‌క‌పోవ‌డంతో ఇక ఈ సినిమాని తీయ‌డం ఆపేసాడ‌నుకున్నారు. కానీ.. వ‌ర్మ ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడో... ఏ సినిమా ఎనౌన్స్ చేస్తాడో ఊహించ‌డం క‌ష్టం. ఇంకా చెప్పాలంటే ఆయన చ‌ర్య‌లు ఊహాతీతం. నిన్నా, ఈ రోజు వ‌ర్మ చేసింది చూస్తే ఎవ‌రైనా ఇదే చెబుతారు. 
 
ఇంత‌కీ ఏం చేసాడంటే... దేవుడంటే న‌మ్మ‌కం లేద‌నే వ‌ర్మ నిన్న‌టి నుంచి గుళ్లూగోపురాలు చుట్టూ తిరుగుతున్నాడు. నాగార్జున‌తో గోవిందా గోవింద అనే సినిమా తీసిన‌ప్పుడు కూడా వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోని వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో దేవుడిని ద‌ర్శించుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments