Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరి నెక్ట్స్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారంతే... వర్మలా GST తీస్తారా?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. త‌న‌యుడు ఆకాష్‌తో తెర‌కెక్కించిన మెహ‌బూబా సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ.. ఆశించిన స్థాయిలో ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఆకాష్‌తో మ‌రో సినిమా తీసి చూపిస్తాన‌న్నాడు. ఆ త‌ర్వాత

Advertiesment
పూరి నెక్ట్స్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారంతే... వర్మలా GST తీస్తారా?
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:23 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. త‌న‌యుడు ఆకాష్‌తో తెర‌కెక్కించిన మెహ‌బూబా సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ.. ఆశించిన స్థాయిలో ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఆకాష్‌తో మ‌రో సినిమా తీసి చూపిస్తాన‌న్నాడు. ఆ త‌ర్వాత చెప్పిన‌ట్టుగానే ఆకాష్‌తో సినిమా తీసేందుకు స్టోరీ రెడీ చేయ‌డం.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేయ‌డం అంతా జ‌రిగింద‌ట‌. అయితే... ఆలోచ‌న‌లో ప‌డిన పూరి ఆకాష్‌తో సినిమా తీసే బాధ్య‌త‌ను త‌న శిష్యుడు అనిల్‌కి అప్ప‌చెప్పాడ‌ట‌.
 
ఈ మూవీకి క‌థ-మాట‌లు పూరి జ‌గ‌న్నాథ్ అందిస్తున్నాడ‌ట కానీ.. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను మాత్రం అనిల్‌కి ఇచ్చాడ‌ట‌. పూరి ప్లాన్ ఏంటంటే.. ఎప్ప‌టి నుంచో హాలీవుడ్ మూవీ చేయాల‌నుకుంటున్నాడు. ఇప్పుడు హాలీవుడ్ నుంచి ఓ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. అందుచేత టాలీవుడ్‌లో కాకుండా హాలీవుడ్‌లో మూవీ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. కేవ‌లం హాలీవుడ్ కోసం రెండు మూడు స్ర్కిప్టులు కూడా రెడీ చేసాడ‌ట‌. ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్నాడ‌ట‌. పూరి... ఇదే క‌న‌క జ‌రిగితే సంచ‌ల‌న‌మే..! ఐతే వర్మ టైపులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ టైపులో తీయకుండా వుంటే మంచిది అని ఇది తెలిసినవారు అనుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4 పాటలతో 'అరవింద సమేత' ఆడియో జ్యూక్‌బాక్స్ ... పెనివిటి సాంగే హైలెట్