బన్నీ - పూరి కాంబినేషన్లో మూవీ ప్లాన్ జరుగుతోందా..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో దేశముదురు సూపర్ డూపర్ హిట్ కాగా, ఇద్దరమ్మాయిలతో యావరేజ్‌గా నిలిచింది. అయితే.. ఆ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో దేశముదురు సూపర్ డూపర్ హిట్ కాగా, ఇద్దరమ్మాయిలతో యావరేజ్‌గా నిలిచింది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పడు మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
పూరి కూడా వరుస ఫ్లాప్స్ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నాడు. అయితే... పూరి కథపై సరిగా వర్క్ చేయకపోవడం వలనే సక్సస్ రావడం లేదు. అదే వేరే వాళ్ల కథ తీసుకుని సినిమా తీస్తే.. హిట్ ఖాయం. అందుచేత బన్నీ, పూరితో సినిమా చేయాలనుకుంటున్నాడట. కాకపోతే బయట కథ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం కథ రాసుకున్న రచయితలు ఆ కథను తామే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటిది పూరికి కథ ఇచ్చేందుకు ఏ రైటర్ అయినా ముందుకు వస్తే... బన్నీ, పూరి కాంబినేషన్ సెట్ అయినట్టే.