ఆలయాలలో కర్పూర హారతి.. ఎందుకంటే?
నోములు, వ్రతాలు, పూజలు వంటి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా ధూప, దీప నైవేద్యాల తరువాతనే హారతిని సమర్పించడం ఒక నియమంగా వస్తోంది. ఏక హారతి, పంచ హారతి, నక్షత్ర హారతి ఇలా ఎటువంటి హారతులైన
Publish Date: Wed, 26 Sep 2018 (11:02 IST)
Updated Date: Wed, 26 Sep 2018 (11:16 IST)
నోములు, వ్రతాలు, పూజలు వంటి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా ధూప, దీప నైవేద్యాల తరువాతనే హారతిని సమర్పించడం ఒక నియమంగా వస్తోంది. ఏక హారతి, పంచ హారతి, నక్షత్ర హారతి ఇలా ఎటువంటి హారతులైన గర్భాలయంలో వెలుతురులో ఉండే స్వామివారిని భక్తులకు చూపుతుంది. ఈ హారతిని భక్తులు కళ్లకి అద్దుకుంటూ పులకించి పోతారు.
కానీ కొంతమంది కర్పూర హారతికి దూరంగా ఉంటారు. కర్పూర హారతి ద్వారా వచ్చే పొగని పీల్చడం మంచిది కాదనీ దాని వలన గొంతు పట్టేస్తుందని అంటుంటారు. మరికొందరు కర్పూర హారతి నుండి వచ్చే పొగ వలన పూజ మందిరం మసి బారుతుందని భావిస్తుంటారు. కానీ కర్పూరాన్ని వెలిగించడం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఆలయాలలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ద్వారా సూక్ష్మక్రిములు వెలువడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సూక్ష్మక్రిములను హరించి అంటు వ్యాధులు రాకుండా కాపాడానికి కర్పూర హారని ప్రధానం పాత్ర పోషిస్తుంది. కర్పూరం తన రూపాన్ని మార్చుకుని జ్యోతిగా మారి దేవుని ఆలయాలలో గాలిలో కలిసిపోతుంది.
Kowsalya
Publish Date: Wed, 26 Sep 2018 (11:02 IST)
Updated Date: Wed, 26 Sep 2018 (11:16 IST)