Webdunia - Bharat's app for daily news and videos

Install App

96లో త్రిష నటన చూసి సమంత బెదుర్స్... అందుకే నావల్ల కాదంటోందా?

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:40 IST)
అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తి కాలంలో తెలుగు వారి హృద‌యాల‌ను దోచుకున్న న‌టి స‌మంత‌. ఇటీవ‌ల యూట‌ర్న్ మూవీతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న స‌మంత ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌తో క‌లిసి ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి మ‌జిలీ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. వైవిధ్య‌మైన క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్‌గా న‌టిస్తున్నాడు.
 
స‌మంత ఈ సినిమా త‌ప్ప ప్ర‌స్తుతం మ‌రే చిత్రం చేయ‌డం లేదు. అయితే.. త‌మిళ్‌లో సూప‌ర్ స‌క్స‌ెస్ సాధించిన 96 మూవీని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో నాని - స‌మంత న‌టించ‌నున్నారు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ.. అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. 
 
నెట్‌లో ఓ అభిమాని స‌మంత‌ని తెలుగు రీమేక్‌లో మీరు త్రిష పాత్రను పోషిస్తున్నారని విన్నాను. ఇది నిజమేనా సామ్‌? అని అడిగారు. దీనికి సామ్‌ స్పందిస్తూ.. త్రిష పాత్ర‌ను మళ్లీ తెరకెక్కించకూడదు అని ట్వీట్‌ చేశారు. స‌మంత మాట‌ల‌ను బ‌ట్టి త్రిష పాత్ర‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు. ప్ర‌చారంలో ఉన్న వార్త‌లో నిజం లేదు అని తెలుస్తుంది. మ‌రి... 96 తెలుగు రీమేక్‌లో త్రిష పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments