Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రాన్స్‌జెండర్‌గా విజయ్ సేతుపతి... సమంత, రమ్యకృష్ణలు...

Advertiesment
ట్రాన్స్‌జెండర్‌గా విజయ్ సేతుపతి... సమంత, రమ్యకృష్ణలు...
, మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:27 IST)
తమిళ ప్రేక్షకులు ‘మక్కల్ సెల్వన్’గా పిలుచుకునే విజయ్ సేతుపతికి తమిళ సినిమాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఎలాంటి పాత్రలోనైనా జీవించగలడు అనే నమ్మకాన్ని ఇటు దర్శక నిర్మాతలతోపాటు అటు ప్రేక్షకులకూ కలుగజేశారు. అందుకే ప్రస్తుతం తమిళనాట ఆయన స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. 
 
తాజాగా ‘చెక్క చివంధ వానమ్’ (తెలుగులో ‘నవాబ్’), ‘96’ సినిమాలతో తన అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు సూపర్ డీలక్స్ సినిమాలో మరో అదిరిపోయే గెటప్‌లో కనబడబోతున్నారు. విజయ్ సేతుపతి ట్రాన్స్‌జండర్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, రమ్యకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా దీనికి తైగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. 
 
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారంనాడు విడుదల చేశారు. అప్పుడే ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ గెటప్‌లో విజయ్ సేతుపతి లుక్ అదిరిపోయింది. ఆ చీర కట్టు, జుట్టు తీరు చూసి విజయ్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మన తెలుగు ప్రేక్షకులు అయితే ఫస్ట్‌లుక్ చూసిన వెంటనే విజయ్‌ను గుర్తుపట్టడం కష్టమే. అంత అందంగా, ఆకర్షణీయంగా ఉంది ఆయన లుక్.
 
ఇంతకీ ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర పేరు శిల్ప. ఇటీవల ఈ పాత్ర గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. శిల్ప క్యారెక్టర్ తనకెంతో ప్రత్యేకమైనదనీ, దర్శకుడు కుమారరాజా తనకు సినిమా స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు.. ‘పారితోషికం నీ ఇష్టమొచ్చినంత ఇవ్వు పర్వాలేదు. కానీ ఆ పాత్ర నాకే ఇవ్వాలి’ అని అడిగినట్లు విజయ్ తెలియజేసారు. ఇంతగా ఇష్టపడి చేసిన ఈ సినిమా ఎలా ఉండబోతోందో, ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'క్వీన్' డైరెక్టర్ రూమ్‌ షేర్‌ చేసుకుంటానంటే ఇబ్బంది లేదన్నాడు... నయనీ దీక్షిత్