Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయం మీది... విజయ రథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నా...

Advertiesment
NTR BioPic look
, గురువారం, 18 అక్టోబరు 2018 (16:59 IST)
విజయం మీది... విజయ రథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నాగారూ... అంటూ 
విజయదశమి శుభాకాంక్షలతో... #NTR బయోపిక్ కు సంబంధించి మరో స్టిల్ వదిలారు. ఇందులో ఎన్టీఆర్ గా బాలయ్య, హరికృష్ణగా కల్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ చిత్రంలోని పలు పాత్రల కోసం పలువురు యువ హీరోహీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు
 
ముఖ్యంగా, ఆ పాతతరం హీరోలు, హీరోయిన్ల పాత్రల్లో యువతరం కథానాయకులు, కథానాయికలు నటిస్తున్నారు. ఈక్రమంలో తాజా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త లుక్ ఒకటి విడుదలైంది. బయోపిక్‌లో నందమూరి కల్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. హరికృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కల్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
 
'30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో బాలగోపాలుడు సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పడు.. బాబాయ్, వాళ్ల నాన్నగారిలా.., నేను మా నాన్న గారిలా" అని క్యాప్షన్ పెట్టాడు కల్యాణ్ రామ్. తాజాగా బయటకు వచ్చిన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ యాత్రలో హరికృష్ణ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
 
రెండు భాగాలుగా తెరకెక్కే ఈ బయోపిక్‌ తొలి భాగం వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానుంది. మొదటి విభాగానికి 'కథానాయకుడు' అని, రెండో విభాగానికి 'మహానాయకుడు' అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. 
 
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండ‌గా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు. 
 
ఎస్వీఆర్ పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించనున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నందమూరి బాలకృష్ణ న‌టిస్తుండ‌గా, దివ‌గంత న‌టి శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ క‌నిపించ‌నుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తారింట్లో స్టైలిష్ స్టార్ దసరా సందడి