Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ మూవీలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ గెట‌ప్‌లు ఎన్నో తెలుసా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ జెడ్ స్పీడు వేగంతో జ‌రుగుతోంది. క్రిష్ త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌కెక్కిస్తూ చాలా బిజీగా ఉన్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాట‌ల‌ను డిసెంబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఇదిలా

ఎన్టీఆర్ మూవీలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ గెట‌ప్‌లు ఎన్నో తెలుసా..?
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:27 IST)
ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ జెడ్ స్పీడు వేగంతో జ‌రుగుతోంది. క్రిష్ త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌కెక్కిస్తూ చాలా బిజీగా ఉన్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాట‌ల‌ను డిసెంబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఇదిలా ఉంటే... అక్కినేని పాత్ర పోషిస్తోన్న సుమంత్ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. సిగ‌రెట్‌తో ఉన్న ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ స్టిల్ చూసిన త‌ర్వాత అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న‌.
 
అది ఏంటంటే... సుమంత్ ఎంతసేపు అక్కినేని పాత్ర‌లో క‌నిపిస్తాడు. ఎన్ని గెట‌ప్స్ ఉంటాయి అని. ఈ సినిమాలో ఎన్టీఆర్ 60 విభిన్న గెటప్‌‌లలో బాలకృష్ణ కనిపించనున్నారని తెలిసింది. ఇక అక్కినేని పాత్ర పోషిస్తోన్న సుమంత్ ఈ చిత్రంలో దాదాపు 8 డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారట. ఎన్టీఆర్ - ఏఎన్నార్‌ల బంధాన్ని చూపించనున్నారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ న‌టించ‌డంతో పాటు ఎన్.బి.కె ఫిల్మ్స్ బ్యానర్ స్ధాపించి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్-ఏఎన్నార్ కెమిస్ట్రీ.. నేడు నాగ్-నాని నటన సూపర్బ్... "దేవదాస్" మూవీ రివ్యూ