Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీస్ థియేట‌ర్‌కు వ‌చ్చి మెచ్చుకుంటున్నారు - శ‌ర్వానంద్‌

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (17:59 IST)
Sharwanand, Rashmika Mandanna, Kishore Thirumala, Srikanth
శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన సినిమా ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు.  ఈనెల 4న శుక్ర‌వారంనాడు విడుద‌లయింది.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  శ్రీ‌కాంత్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్రం థియేట‌ర్ల‌లో మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ శ‌నివారంనాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్  ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది.
 
ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక మాట్లాడుతూ, నేను చెప్పిన‌ట్లుగానే విడుద‌ల రోజు మా అమ్మ నాన్న థియేట‌ర్లో సినిమా చూశారు. ఇలాంటి సినిమా రావ‌డానికి చాలా కాలం ప‌ట్టింద‌ని తెలిపారు. ఒక మంచి సినిమా చూశామ‌నే ఫీలింగ్‌ను వారు వ్య‌క్తం చేశారు. ఇంటిలోని మ‌హిళ‌లు కూక‌డా చూసే సినిమా ఇది. మ‌న కుటుంబంలోని వ్య‌క్తులు ఈ సినిమాలోని పాత్ర‌లు ద్వారా మ‌న క‌ళ్ళ ముందు క‌నిపిస్తారు. నిన్న కొన్ని థియేట‌ర్ల‌కు వెళ్ళాం. అక్క‌డ అంతా ఫ్యామిలీతోనే సినిమాకు వ‌చ్చారు. వ‌చ్చే వారం కూడా మంచి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.
ఈ సంద‌ర్భంగా త‌న పెండ్లి గురించి వివ‌రిస్తూ, సినిమాలో చూపించిన‌ట్లుగా నా త‌ల్లి ఖబ్సూ ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. కానీ మా అమ్మ‌నాన్న‌లు నీకు న‌చ్చితే మేం మాట్లాడ‌తాం అని చెప్పారని అన్నారు.
 
శ‌ర్వానంద్ మాట్లాడుతూ, మేం విడుద‌ల‌కు ముందు ఏదైతే అనుకున్నామో అది నేడు జ‌రిగింది. చాలా సంతోషంగా వుంది. నా కుటుంబ‌స‌భ్యులుతోపాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుంద‌న్నారు. ఇది బాగోలేద‌ని ఒక్క‌రూ కూడా అన‌డం నేను విన‌లేదు. మ‌నింటిలో జ‌రిగే క‌థ‌లా వుంటుంది. మేం న‌వ్విస్తామ‌ని చెప్పాం. అలాగే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు న‌వ్వుతూనే వున్నారు. హ్యాపీగా చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్‌కు వ‌చ్చి ఎంజాయ్ చేస్తున్నామ‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తెలుపుతూ, స‌హ‌జంగా సినిమా విడుద‌లైతే ఒక‌టి, రెండు టిక్క‌ట్లు అడుగుతారు. కానీ నిన్న ఈ సినిమా విడుద‌ల‌యిన‌ప్పుడు 10 టిక్కెట్లు కావాల‌ని పోన్లు వ‌చ్చాయి. చూసిన వారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంట‌ర్ వెల్‌లో వున్న ట్విస్ట్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాను ఆదరిస్తున్న మ‌హిళ‌ల‌కు, ప్రేక్ష‌కుల‌కు, నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. నిన్న మా వీధిలోని వారంతా క‌లిసి సినిమా చూశారు. `నేను శైల‌జ‌`తో కాకుండా ఈ సినిమా నీకు మంచి గుర్తింపు వ‌చ్చిందనివారు తెలియ‌జేయ‌డం సంతోషంగా వుంది.` అన్నారు.
 
న‌టి రుచిత మాట్లాడుతూ, నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.. మొద‌ట ప్ర‌వ‌ల్లిక పాత్ర చెప్పిన‌ప్పుడు చేయ‌లేనేమో అని అనుకున్నా. కానీ నాచేత చేయించారు. శ‌ర్వానంద్‌, ర‌ష్మిక సెట్లో వుంటే అంతా స‌ర‌దాగా వుంటుంది. ఇందులో న‌టించిన సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌న్నారు.
న‌టి దీప్తి మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా వుంద‌న్నారు.
 
స‌హ నిర్మాత శ్రీ‌కాంత్ తెలుపుతూ, నిన్న కొన్ని థియేట‌ర్ల‌కు వెళ్ళి  సినిమా చూశాం. ప్రేక్ష‌కులు చాలా స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఈ వారంలో మ‌రింత‌మంది సినిమా చూసి ఆనందించండి అని తెలిపారు.
 
కెమెరామెన్ సుజిత్ తెలుపుతూ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకున్నారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments