Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు క్లాప్స్ కొట్టేలా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వుంటుంది

Advertiesment
మహిళలు క్లాప్స్ కొట్టేలా ఆడవాళ్ళు మీకు జోహార్లు  సినిమా వుంటుంది
, గురువారం, 3 మార్చి 2022 (17:36 IST)
Joharlu team
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు.  ఈనెల 4న శుక్రవారంనాడు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్వేడుక గురువారం హైదరాబాద్లోని స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.  శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

చిత్రం గురించి దర్శకుడు కిశోర్ తిరుమల వివరిస్తూ, పాండమిక్ ముందు యాక్షన్, మాస్, యూత్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ కథలూ వచ్చాయి. అన్నీ సక్సెస్ అయ్యాయి.పాండమిక్ తర్వాత పిల్లలతో చూసే సినిమాను మిస్ అయ్యాం. ఆ వాతావరణాన్ని మా సినిమా వంద శాతం ఇస్తుందని నమ్ముతున్నా. థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఈమధ్యనే పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకు వెళితే అక్కడ ఇతర కుటుంబాల మహిళలు తమ సభ్యుల పేర్లు చెబుతుంటే అవన్నీ మా సినిమాలోని పేర్లుగా అనిపించాయి. కనుక ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో లవ్స్టోరీ కూడా వుంది. ఇంతకు ముందు నేను చేసిన ఉన్నది ఒక్కటే జిందగి. సినిమాను చూసి యూత్ చాలామంది తమను తాము చూసుకున్నామని చెప్పారు.   నేను శైలజ ఫాదర్, డాటర్ రిలేషన్పై తీశాను. అందులో చెప్పినట్లుగా నా స్నేహితుడు కనెక్ట్ అయి పెద్దగా మాటలు లేని అతను తప్పు తెలుసుకుని నన్ను పలుకరించాడు. ఇందులో అన్నీ సీన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్  సీన్కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను అని తెలిపారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్ కి వచ్చి చూడండి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలోని పాత్రలు మన ఇంటిలో అమ్మ, చెల్లి ఎలా మాట్లాడతారో అలానే వుంటాయి. కొన్ని సంఘటనలు మన ఇంటిలో జరిగేవిగా కనిపిస్తాయి. మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు తొలి ఆట చూస్తానన్నారు. మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి అని అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ, మార్చి 4న విడుదల కాబోతుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళతారని అన్నారు.

ఝాన్సీ మాట్లాడుతూ, థియేటర్లో కుటుంబంతో సినిమా చూడడం గొప్ప అనుభూతి. ఇది ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా కాదు. అందరికీ సంబంధించిన సినిమా. ఉమెన్స్ డే కానుకగా   నాలుగు రోజుల ముందు విడుదలవుతుంది. ఈ కథ ఎంపికతో హీరో, దర్శక నిర్మాతల కృషి  ప్రశంసనీయం. ఎంతో మంది మహిళలున్నా ఎవరి పాత్ర వారికి డిజైన్ చేయడం గొప్ప విషయం. ఆద్య పాత్ర ద్వారా రష్మిక మరింత దగ్గరవుతుంది. శర్వానంద్ భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు మంచి సినిమా అవుతుందని తెలిపారు.

 కెమెరామెన్ సుజిత్ తెలుపుతూ, ఒకే ఒక్క జీవితం తర్వాత శర్వానంద్తో చేస్తున్న రెండో సినిమా. కిశోర్ కథ చెప్పగానే నా కుటుంబంలోని మహిళలకోసం కూడా సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి కొన్ని సినిమాలు మాత్రమే కుటుంబాలను టచ్ చేస్తాయి. సుధాకర్, శ్రీకాంత్ నిర్మాతలుగా ఎంతో సహకరించారు. సీనియర్లు బాగా సహకరించారు.. ఈ సినిమా లేడీస్కు డెడికేటెడ్గా వుంటుంది అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగిపోయిన 'బిగ్‌బాస్ నాన్ స్టాప్' షో.. కారణం ఏంటంటే?