హీరో నాని చెప్పింది ఒకటి.. జనాల్లోకి వెళ్లింది మరొకటి : నిర్మాత దిల్ రాజు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (08:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని కోరారు. 
 
తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని, నాని, తన కాంబినేషన్‌లో వచ్చిన 'వి' సినిమా అని గుర్తుచేశారు. 
 
నాని ఏం చెప్పాడన్న విషయాన్ని ఆయన మనస్సులోకి వెళ్లి చూడాలని, అపుడే ఆయన బాధ ఏంటో అర్థమవుతుందని అన్నారు. తన రెండు సినిమాలు ఓటీటీకీ వెళ్లిన బాధ ఆయనలో ఉందన్నారు. నిజానికి నాని చెప్పిన విషయం ఒక్కటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటి అని దిల్ రాజు గుర్తుచేశారు. 
 
అలాగే, సినిమా టిక్కెట్ ధరల విషయంలో త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తామని చెప్పారు. అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సినీ రంగ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించేందుకు చిత్ర పరిశ్రమ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో పరిశ్రమకు చెందిన పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments