తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, అలాంటి వాటిలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశం ఒకటన్నారు. ఒక సమస్య వచ్చినపుడు అందరూ ఏకమవ్వాలని కానీ, టాలీవుడ్‌లో ఐక్యత లోపించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు సినిమా థియేటర్లు నడుపలేమంటూ అనేక థియేటర్లు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు.
అదేసమయంలో హీరో నాని ఈ టిక్కెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల కలెక్షన్ కంటే... పక్కనే ఉన్న కిరాణా కొట్ట కలెక్షన్లు బాగున్నాయనే కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దీంతో హీరో నాని మరోమారు స్పందించారు. ఏపీ సినిమా టిక్కెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని వెల్లడించానని, కానీ, తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారన్నారు.